
వేసవిలో కీర దోసకాయ తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే.. కీర దోసకాయలు పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు. ఇవి హైడ్రేషన్, ఎముక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా కీరదోసకాయను తినటం వల్ల శరీరానికి తేమను అందిస్తూ హైడ్రేషన్‌ను పెంచుతుంది. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యం మెరుగుపరచడానికి, జీర్ణక్రియ సజావుగా ఉండటానికి, చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగు పడేలా చేస్తుంది. అయితే, రోజుకు ఎన్ని కీరదోసకాయలో మీకు తెలుసా..? ఇక్కడ తెలుసుకుందాం..
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. కీరదోసలో నీరు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో కీరదోస తింటే శరీరం చల్లబడుతుంది.
కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. శరీర అవసరాలను బట్టి 2 నుంచి 3 కీరదోస తినాలి. ఏదైనా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి కీరదోస తింటే ఆమ్లత్వం లేదా త్రేనుపులు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో దోసకాయ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..