
ఐపీఎల్ 2024లో దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ సీజన్‌లో ఫైనల్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఓడిపోయినప్పటికీ.. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీని మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసించారు. అయితే ఐపీఎల్ 2025లో సీన్ మారిపోయింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే గెలిచి.. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది SRH. జట్టులో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, ట్రావిస్ హెడ్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్‌కు దగ్గరలో ఉంది. ఈ తరుణంలో వచ్చే సీజన్‌కు ముందుగా హైదరాబాద్ ఫ్రాంచైజీ హెడ్ కావ్యమారన్ లేఆఫ్స్ షురూ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ నలుగురి ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ ఉందట.
ఇషాన్ కిషన్:
ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను రూ. 11.40 కోట్లతో కావ్య మారన్ మెగా ఆక్షన్‌లో కొనుగోలు చేసింది. ఈ ప్లేయర్‌పై భారీ అంచనాలు నెలకొన్నా.. పేలవ ఆటతీరు కనబరుస్తున్నాడు. ఒక్క సెంచరీ మినహా.. మరే మ్యాచ్‌లోనూ సరిగ్గా ఆడలేదు. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లలో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. పారితోషికం, ఫామ్ బట్టి ఈ ప్లేయర్‌పై వేటు పడే ఛాన్స్ ఉందట.
హెన్రిచ్ క్లాసెన్:
ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లకు అట్టిపెట్టుకుంది. గతేడాది ఫినిషింగ్ రోల్ పోషించిన క్లాసెన్.. ఈసారి తన సత్తాకు తగ్గట్టుగా ప్రదర్శన కనబరచలేకపోయాడు. ఆడిన 10 మ్యాచ్‌లలో 311 పరుగులు మాత్రమే చేశాడు. కీలక మ్యాచ్‌లలో ఫినిషింగ్ రోల్ పోషించలేకపోయాడు. జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో హై శాలరీ.. లో రిటర్న్స్ వల్ల క్లాసెన్ రిలీజ్ అవ్వొచ్చు.
మహమ్మద్ షమీ:
టీమిండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు పలు కీలక విజయాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన షమీ.. ఈ ఏడాది సన్‌రైజర్స్ తరపున ఆడుతున్నాడు. రూ. 10 కోట్లతో ఈ ఫాస్ట్ బౌలర్‌ను దక్కించుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. అయితే ఫామ్‌లేమి కారణంగా ఆడిన 9 మ్యాచ్‌లలో 11.23 ఎకానమీతో కేవలం 6 వికెట్లు తీశాడు. వచ్చే సీజన్‌కు షమీ.. హైదరాబాద్ జట్టు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
రాహుల్ చాహార్:
మెగా ఆక్షన్‌లో రూ. 3.20 కోట్లకు రాహుల్ చాహార్‌ను దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే అతడిపై ఎలాంటి నమ్మకం లేనట్టు ఉంది. కేవలం ఒక్క మ్యాచ్.. ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. చూస్తుంటే అతడు జట్టును బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..