
వేణు తొట్టెంపూడి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో కచ్చితంగా ముందు వరసలో ఉంటుంది చిరునవ్వుతో. 2000లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగులు ఈ మూవీలో హైలెట్ అని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ గా నిలిచింది. యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే 25 ఏళ్లు గడిచినా ఈ మూవీ టీవీలో వస్తే ఛానెల్ మార్చుకుండా చూసే వాళ్లు చాలామంది ఉంటారు. ఈ మూవీ హీరో వేణు గురించి అందరికీ తెలిసిందే. ఇక హీరోయిన్ సంగతి విషయానికి వస్తే.. వేణు లవర్ సంధ్య పాత్రలో అద్భుతంగా నటించింది షహీన్ కాన్. ముంబైకు చెందిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో షహీన్ క్యూట్ లుక్స్‌కు అప్పటి కుర్రకారు ఫిదా అయ్యారు. చిరునవ్వుతో సినిమా తమిళ్, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యింది. హీరోలు మారారే కానే హీరోయిన్ గా షహీన్ ఖానే నటించింది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన షహీన్.. పలు మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించింది. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో మెరిసింది. ఆ వెంటనే చిరునవ్వుతో సినిమాతో వెండితెరకు పరిచయమైంది షహీన్. సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే తమిళ్, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ రవిచంద్రన్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటి తర్వాత హీరో శ్రీకాంత్ తో కలిసి డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో కనిపించింది. ఇదే ఆమెకు లాస్ట్ సినిమా. దీని తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది షహీన్. ఇప్పుడామెకు ఒక కూతురు ఉంది.
షహీన్ లేటెస్ట్ ఫొటోస్..
కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది షహీన్. తన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది. వీటిని చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. షహీన్ అందం అసలు తగ్గలేదని, ఇప్పటికీ అలాగే ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరునవ్వుతో హీరోయిన్ లేటస్ట్ ఫొటోస్‌పై మీరూ ఓ లుక్కేయండి.
గ్లామరస్ లుక్ లో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.