
పాములు వేటాడమంలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. అవి చాలా చురుకుదనంతో తమ ఎరపైకి దూసుకుపోతాయి. ఇక చాలావరకు పాములు ఆహారాన్ని అమాంతం మింగేస్తాయి. అలా మింగినా అరిగే సామర్థ్యం వాటికి ఉంటుంది. పాములు.. ఎలుకలు, కప్పులు, కీటకాల వంటి వాటని మింగేయడం మీరు చూసి ఉంటారు. మింగడంలో అవి పీహెచ్‌హీ చేశాయి ఏమో తెలియదు కానీ.. తమకంటే పరిమాణంలో పెద్దవైన జీవుల్ని కూడా ఈజీగా లాగించేస్తాయి. అలాంటి ఒక పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, పాము తన తల కంటే ఐదు రెట్లు పెద్దగా ఉన్న గుడ్డును మింగేసింది. వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వామ్మో.. అంత చిన్న పాము అంత పెద్ద గుడ్డును ఎలా మింగేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము ఆఫ్రికన్ డాసిపెల్టిస్ మెడిసి పాముగా చెబుతున్నారు. పాములకు వెడల్పుగా బాగా చదునుగా ఉండే శ్వాసనాళం ఉండటం వల్ల అవి భారీ ఆహారాన్ని మింగుతున్నప్పుడు సైతం శ్వాసకు ఇబ్బంది ఉండదని నిపునణులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..